- Advertisement -
ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని కాపాడండి
Save the Government Junior College placeకలెక్టరేట్ వద్ద సిపిఐ, సిపిఎం, ప్రజాసంఘాలు ధర్నా
నరసరావుపేట,
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పిడుగురాళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని కాపాడాలని కోరుతూ సోమవారం నరసరావుపేట కలెక్టరేట్ వద్ద కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని ఆక్రమించి కొందరు రోడ్డు వేశారన్నారు. అక్రమ దారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జూనియర్
కళాశాలలో డిగ్రీ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అక్కినపల్లి బాలయ్య, కృష్ణ నాయక్, సిపిఎం నాయకులు శ్రీనివాసరావు, కే ఎన్ పి ఎస్
నాయకులు కృష్ణ, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




