- Advertisement -
ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి
Prajavani applications should be dealt with expeditiouslyజిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్
ప్రజావాణిలో ఫిర్యాదు చేసే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ రెవెన్యూ, నగర పాలిక కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, మైనారిటీ సంక్షేమ అధికారి పవన్ కుమార్ తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి మొత్తం 333 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఇబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -




