- Advertisement -
త్వరలో వనపర్తికి రానున్న ముఖ్యమంత్రి తో ఎమ్మెల్యే భేటీ
The MLA met the Chief Minister who is coming to Vanaparthi soon పలు శంకుస్థాపనలు, అభివృద్ధి అంశాలపై ప్రత్యేక చర్చ
పాల్గొన్న పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి
వనపర్తి
వనపర్తి నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభాలు, శంకుస్థాపనలపై త్వరలోనే వనపర్తికి రానున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించిన అంశాలతో పాటు, విద్య వైద్యం వ్యవసాయం సాగునీరు లాంటి తదితల అంశాలపై కీలకంగా చర్చించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రత్యేక భేటిలో నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ డాక్టర్ మల్లు రవి పాల్గొని పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్న ఉద్యోగ మేళా, రుణమేళకు సంబంధించిన అంశాలపై చర్చించారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి వచ్చే తేదీని త్వరలోనే ప్రకటించనున్నామని ఎమ్మెల్యే చెప్పారు
- Advertisement -




