నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి

- Advertisement -

నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి

MLA Dr BV Jayanageshwar Reddy inaugurated the new buses

కూటమి ప్రభుత్వం వచ్చాక 19 ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చాం

ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు పట్టణంలో గత ప్రభుత్వం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు.. ఒక టైరు కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా 6 నెలలలో నాలుగు సార్లు 19 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చామని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి  అన్నారు. సోమవారం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో 2 కొత్త బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతి రహదారిలో బస్సులను తిరుగుతాయని స్పష్టం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular