- Advertisement -
డివైడర్ ను ఢీకొన్న స్కూటర్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
The scooter collided with the divider. The person was seriously injuredతిరుపతి
వడమాలపేట అంజేరమ్మ కనుమ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక స్కూటర్ అతివేగంతో రోడ్డు డివైడర్ ను ఢీకొంది. ఘటనలో స్కూటర్చ క్షతగాత్రుడు సుమారుగా 300 మీటర్ల దూరంలో వేరువేరు రోడ్లలో పడిపోయారు. ప్రమాదంలో క్షతగాత్రుడి ముక్కు, నోటి, తల భాగాలలో దెబ్బల తగిలి రక్తస్రావంతో తీవ్రంగా గాయాలయ్యాయి. తమిళనాడు తిరువళ్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తమిళనాడు తిరువళ్లూరు నుంచి చంద్రగిరి లోని అతడి చెల్లి ఇంటికి వెళ్లే క్రమంలో ఘటన చోటుచేసుకుంది. కాలినడకన వెళ్లే శ్రీవారి భక్తులు గమనించి, 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడకి చేరుకొని ప్రధమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రున్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -




