క్షేత్ర స్థాయిలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్ప రధం’తో ప్రచారం

- Advertisement -

క్షేత్ర స్థాయిలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్ప రధం’తో ప్రచారం

Campaign with 'Sankalpa Radham' for drug control at field level

విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు
విజయనగరం
మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను యువతకు వివరించి, వారిని మాదక ద్రవ్యాల అలవాటుకు దూరం చేసేందుకు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సంకల్ప రధం’తో ప్రచారం చేపడుతున్నట్లుగా విజయనగరం రూరల్ సర్కిల్ సిఐ బి.లక్ష్మణరావు తెలిపారు.
ఈ సందర్భంగా విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు మాట్లాడుతూ – విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు యువతతోపాటు డ్రగ్స్కు అలవాటు ఉన్న వ్యక్తులు, ప్రజలకు ‘సంకల్పం’ కార్యక్రమాన్ని మరింత
చేరువ చేసి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంకల్పించి ప్రత్యేకంగా రూపొందించిన ‘సంకల్ప రధం’ తో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొని వచ్చేందుకు గాను జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇందులో
భాగంగా విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు ఎస్ఐ వి. అశోక్ కుమార్ మరియు వారి సిబ్బంది కలిసి విజయనగరం రూరల్ పోలీసు స్టేషను పరిధిలో గల ద్వారపూడి, గుంకలాం, కొండకరకాం, జమ్ము, బిసి కాలనీ మరియు విటి అగ్రహారం గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాల్లో ‘సంకల్ప రధం’ వాహనాన్ని నిలిపి, వీడియోలు ప్రదర్శించి ప్రజలకు, యువతకు మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్థాలు, దుష్ప్రభావాల గురించి, రహదారి భద్రత, మహిళల భద్రత, సైబరు మోసాలు వివరిస్తూ అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో యువత తమ జీవితాలను నాశనం
చేసుకుంటున్నారని వాటి జోలికి పోకుండా మంచి వైపు పయనించాలన్నారు. మత్తు పదార్థాలు వినియోగం వలన కలిగే అనర్ధాలను వీడియోల ద్వారా వివరించి అవగాహన కల్పించారు. సైబరు మోసాలు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా సైబరు మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, ఎస్ఐ వి. అశోక్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది ఆయా గ్రామాల్లో యువత, ప్రజలు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular