20లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.

- Advertisement -

20లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.

Field inspection should be completed within 20

జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి

జయశంకర్ భూపాలపల్లి,

ఈ నెల 20 లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
శనివారం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి శివారు,  భూపాలపల్లి మండలం సుభాష్ కాలనిలో  జరుగుతున్న రైతు భరోసా, ఆహార భద్రతా కార్డుల విచారణ ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు. తనిఖీ లో నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా చేస్తున్న ఈ సర్వేలో అర్హులైన ఏ ఒక్కరు మిస్ కావొద్దని సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న విచారణ  ప్రక్రియను ఈ నెల 20వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. పలు సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ  వివరాలను పరిశీలిస్తున్నారని తెలిపారు.  క్షేత్రస్థాయి పరిశీలనలో సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు . క్షేత్రస్థాయి విచారణ ఈ నెల 20వ తేదీ వరకు పూర్తి చేయాలని, 21 నుండి 24 వరకు గ్రామసభలు నిర్వహణకు  సన్నద్ధం కావాలని అన్నారు.  ఎలాంటి పొరపాటుకు తావులేకుండా  పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో  క్షేత్రస్థాయిలో విచారణ  కొనసాగుతోందని తెలిపారు. ముఖ్యంగా రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు లబ్ది చేకూర్చేందుకు వీలుగా సాగుకు యోగ్యమైన భూములను సర్వే నెంబర్ల వారీగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆహార భద్రతా కార్డులకు  అర్హత కలిగిన కుటుంబాలకు అందించేందుకు వీలుగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఆయా పథకాల కింద అర్హులైన వారి జాబితాలను రూపొందించి, 21 నుండి 24వ తేదీ వరకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణలో నిర్వహించనున్న గ్రామ సభలలో జాభితాను   చదివి వినిపించడం జరుగుతుందన్నారు. గ్రామ సభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్ లో నమోదు చేస్తామన్నారు. ఈ నెల 26 వ తేదీన ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టి లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చనుందని కలెక్టర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, గణపురం, భూపాలపల్లి తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular