44 నైపుణ్యాల ద్వారానే ఉద్యోగ అవకాశాలు

- Advertisement -

44 నైపుణ్యాల ద్వారానే ఉద్యోగ అవకాశాలు

Job opportunities through 44 skills

మల్లవల్లి ఇండస్ట్రీయల్ కారిడార్ లో 420 పరిశ్రమలు

ఫిబ్రవరిలో అశోక్‌లేలాండ్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ ప్రారంభించే అవకాశం

స్వర్ణ భారత్ ట్రస్ట్ లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీయువకులతో ముఖాముఖీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

ఉంగుటూరు మం
ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఏర్పాటు చేసిన ముఖా ముఖిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ మహనీయులు జన్మించిన గడ్డ కృష్ణాజిల్లా అని అలాంటి జిల్లా ఏడు నియోజకవర్గాలకు పరిమితం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాలను కృష్ణాజిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయకపోతే జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరుకానని చెప్పారు.  మల్లవల్లి పారిశ్రామికవాడకు 420 పరిశ్రమలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. మల్లవల్లి ఇండస్ట్రీయల్ కారిడార్ లో పరిశ్రమల స్థాపన కోసం 183 కంపెనీలు స్థలాలు కేటాయించాలని APIIC అధికారులకు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఒక్క గన్నవరం నియోజకవర్గం నుంచే యువతకు 50 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో 15 వేల మంది నిరుద్యిగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని లేని పక్షంలో రాజకీయాలలో కొనసాగనని చెప్పానని అందుకు తగ్గట్లుగానే ఉద్యోగాల కల్పనకు పెద్దపిట వేస్తున్నట్లు తెలిపారు. గతంలో మల్లవల్లిలో పరిశ్రమలు స్థాపించి వెనక్కి వెళ్లిపోయిన సంస్థలను తిరిగి తీసుకువస్తున్నామని యార్లగడ్డ పేర్కొన్నారు. అశోక్‌లేలాండ్‌ సంస్థ ఇప్పటికే బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ని ప్రారంభించనుందని, ఫిబ్రవరి లో అది ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అమర్ రాజా, hcl లాంటి కంపెనీలు కూడా రానున్నాయని తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పారిశ్రామికవాడ తరహాలో మల్లవల్లి పారిశ్రామికవాడ కూడా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నదే తన ఆకాంక్ష అని త్వరలోనే మల్లవల్లి పరిశ్రమలతో కళకళలాడేలా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటున్నానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెల్లడించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular