పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య

- Advertisement -

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య

Commissioner N. Maurya inspected the sanitation works

తిరుపతి,
నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్.టి.వి.నగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మంగళవారం ఉదయం ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో కలసి కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు కార్పొరేటర్ ఆంజనేయులు తో కలసి పరిశీలించారు. ప్రధాన దారులతో పాటు, సందుల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించగా మురుగు కాలువలు పాడై , చెత్త నిల్వ ఉండడంతో సంబంధిత అధికారులను మందలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధాన వీధులే కాకుండా చిన్నచిన్న వీధుల్లో కూడా మురుగునీటి కాలువలు, రోడ్లు శుభ్రంగా ఉంచాలని అన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయాలని అన్నారు. మురుగునీటి కాలువలు, రోడ్లు మరమ్మత్తులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, దుకాణదారులు పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మీ ఇంటి వద్దకు వచ్చే తమ సిబ్బందికి చెత్త ఇచ్చి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ. లలిత, డి.సి.పి. మహాపాత్ర, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular