- Advertisement -
ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు, రేషన్ కార్డ్
Houses, ration card for every poor familyదశలవారీగా అందరికీ అందజేస్తాం
జాబితాలో పేర్లులేని వారికి మరోసారి దరఖాస్తుకు అవకాశం
మహబూబ్ నగర్
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కప్పెట గ్రామంలో జరుగుతున్న గ్రామ సభలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గోన్నారు.
మంత్రి మాట్లాడుతూ ప్రజలతో మమేకం కావడానికి, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామసభలు ఉపయోగపడుతాయి. పార్టీలకు అతీతంగా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. పథకాలకు లబ్దిదారుల ఎంపికలో రాజకీయాలకు తావులేదని అన్నారు.
దశలవారీగా ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లు, రేషన్ కార్డు ఇస్తాం. అర్హులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా ₹12 వేలు అందజేస్తాం. పథకాలకు గతంలో దరఖాస్తు చేసుకోనివారికి, దరఖాస్తు చేసుకున్నా పేరు రానివారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి దరఖాస్తునూ మరోసారి పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకాలు అందజేస్తాం. మీ ఊరికి మళ్లీ వచ్చి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను నేనే ప్రారంభిస్తానని అన్నారు.
గతంలో రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు ఇండ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రతి పేద కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత, వారికి ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు, కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిదని అన్నారు.
- Advertisement -




