మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా  సి ఈ ఐ ఆర్  అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా  సి ఈ ఐ ఆర్  అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి

Even if the mobile phone is lost or stolen, CEIR application should be used

పరిధిలో  పోగొట్టుకున్న, చోరికి గురైన 200 మొబైల్ ఫోన్లను (సుమారు 25,68.997లక్షల విలువగల) బాధితులకు అందజేత.

గోదావరిఖని :

రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న/ దొంగాలించబడిన సెల్ ఫోన్ ల  స్వాధీనంకు సంబందించి సిపి  ఆదేశాల మేరకు  సిసిఎస్ ఇన్స్పెక్టర్  కమలాకర్   నేతృత్వంలో రామగుండము కమీషనరేట్   సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు స్వాదినం చేసుకొన్నా సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా పోగొట్టుకున్న / దొంగలించబడిన సెల్ ఫోన్ల ఆచూకీ కనుగొని పోలీస్ స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ను రామగుండము పోలీస్ కమిషనర్  ఎం.శ్రీనివాస్   చేతులమీదుగా సెల్ ఫోన్ యజమానులకు అందజేశారు.
ఈ సందర్భంగా సిపి  సి ఈ ఐ ఆర్  గురించి వివరిస్తూ….* దొంగతనం కాబడిన కానీ లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ ల ఆచూకీ కోసం సిసిఎస్ తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 5280 సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయగా ఇందులో ఇప్పటి వరకు 1538 సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకొని సెల్ ఫోన్ యజమానులకు అందజేయడం జరిగిందని, గత కొంతకాలంగా సిసిఎస్ ,ఐటి సెల్ పోలీసులు శ్రమించి మరో సుమారు  200 ల సెల్ ఫోన్ల ను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని, సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్ సి.ఇ.ఈ.ఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, రామగుండము పోలీస్ కమీషనరేట్ లో తేది 19-04-2023 నుండి ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ నందు బ్లాక్ చేసి, సంబందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular