- Advertisement -
అక్రమ నిర్మాణాల తొలగింపు పాతబస్తీనుంచి మొదలు పెట్టాలి–దానం నాగేందర్
Removal of illegal constructions should start from the old town--Daman Nagender
హైదరాబాద్
అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం నాడు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయన ఖైరతాబాద్ , సోమాజిగూడ డివిజన్ కు చెందిన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓల్డ్ సిటీ లో అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా. మొదలు పెడితే అక్కడి నుండే తొలగింపులు చేయాలి. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని… హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేను. పేద ప్రజల జీవనాధారం దెబ్బతిస్తే , వారికి అండగా ఉంటాను. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలు మనుగడ ఉండదు. ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పని చేయాలి. హైడ్రా చెరువులను కాపాడటానికి పని చేస్తుంది , దానిని స్వాగతిస్తున్నాను. పబ్లిక్ నోటీస్ ఇచ్చి , కూల్చివేతలు చేయాలని అన్నారు.
- Advertisement -



