పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల  జైలు శిక్ష…రూ. 10 వేలు జరిమాన

- Advertisement -

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల  జైలు శిక్ష…రూ. 10 వేలు జరిమాన

20 years imprisonment for accused in POCSO case...Rs. 10 thousand fine

కర్నూలు
2021 యేడాది కర్నూలు మహావీర్ నగర్ లో జరిగిన మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన కేసులో నిందితుడికి  కర్నూలు జిల్లా  స్పెషల్ ఫోక్సో కోర్టు  20 సంవత్సరాల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమాన విధించింది. నిందితుడు కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం , గంజ హల్లి గ్రామంకు చెందిన  దర్గా షేక్షావలి  ( 30 సం.రాలు)  జెసిబి కి డ్రైవర్ గా పని చేస్తున్నాడు.  కర్నూలు , మహావీర్ నగర్  లో  ఓ మైనర్  బాలిక పట్ల  అఘాయిత్యానికి  పాల్పడ్డాడు.  బాలిక తల్లి జి. శాంత  ఫిర్యాదు మేరకు 2021  ఆగష్టు 12  వ తేదీన కర్నూలు మహిళా  పోలీసు స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 74 / 2021 u/s  376 (2) n 376(3) 506 IPC and Sec 6 of  పోక్సో యాక్ట్ 2012  నమోదు చేశారు. అప్పటి మహిళా పియస్ డిఎస్పీ వెంకటరామయ్య  దర్యాప్తు చేపట్టి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు.
బాధితు రాలికి ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల నష్ట పరిహారం వచ్చే విధంగా జడ్జి భూపాల్ రెడ్డి  తీర్పు వెలువరించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular