WEF సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ‘ఏపీ బ్రాండ్’ ఇమేజ్
'AP Brand' image on global stage through WEF conference
ప్రభుత్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి దిగ్గజ సంస్థలకు ఆహ్వానం
ముఖాముఖి భేటీలు, సదస్సులు, చర్చలతో ఎపిని ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు
మార్స్క్ నుంచి మైక్రోసాఫ్ట్ ప్రపంచ స్థాయి సంస్థలు, సీఈవోలతో చర్చలు
నెట్వర్క్ విస్తరణ, బ్రాండ్ ప్రమోషన్ లో సక్సెస్….ఆశావాహంగా సిఎం బృందం
దావోస్ టూర్
ముగిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పర్యటన…
తిరుగు ప్రయాణం
దావోస్, జనవరి 23:-
ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే… మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్‌ను, ఎపి బ్రాండ్ ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు.
సమావేశాలు సఫలం :
ప్రపంచం దేశాల నుంచి దావోస్‌కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలు… పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.



