- Advertisement -
పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు
Hydra demolitions in Pocharam Municipality
ఊపిరి పీల్చుకున్న దివ్యనగర్ లేఔట్ ప్లాట్ ఓనర్లు
ఆనందం వ్యక్తం చేసిన పరిసర కాలనీల నివాసితులు..
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో శనివారం హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే ఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ తొలగించారు. దివ్యనగర్ లే ఔట్ చుట్టూ అక్రమంగా ప్రహరీని నిర్మించి.. గేటు పెట్టి తమను అనుమతించడంలేదంటూ నల్ల మల్లారెడ్డిపై ప్లాట్ల యజమానుల ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జనవరి 8వ తేదీన క్షేత్రస్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దివ్యనగర్ లేఔట్లోంచి తమ నివాసాలకు, పక్కనే ఉన్న ఇతర లే ఔట్లకు ఉన్న దారులను మూసేసి ఇబ్బందులు పెడుతున్నారంటూ నల్లమల్లారెడ్డిపై పలు కాలనీవాసులు ఫిర్యాదులు చేసారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో 23వ తేదీన హైడ్రా ప్రధాన కార్యాలయంలో ఇరు పక్షాలతో చర్చించారు హైడ్రా కమిషనర్. దారులు మూసేయడమే కాకుండా.. ఆ లే ఔట్లలోని తమ ప్లాట్లు అమ్ముకోలేని పరిస్థితి ఉందంటూ పలువురు ఆవేదన. ఒక వేళ అమ్మినా ఆయన సమక్షంలో అమ్మకాలు జరగాలని ఇందుకు రూ. 50 వేలు చెల్లించాలని ఫిర్యాదు లో లేఔట్ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట డబ్బులు వసూలు చేసి.. మురుగునీటి వ్యవస్థ, రహదారులు నిర్మించకుండా.. లే ఔట్ చుట్టూ భారీ ప్రహరీ నిర్మించి.. గేట్లు పెట్టి తమను కూడా అనుమతించడంలేదని.. ఇదే విషయాన్ని నిలదీస్తే తమను కొట్టారంటూ నల్లమల్లారెడ్డి సమక్షంలోనే కమిషనర్కు ఫిర్యాదు చేసారు. * తమ ప్లాట్ను తామే చూడాలన్నా, వేరే వాళ్లకు చూపాలన్నా.. అనుమతి ఉండదని.. ఆయన నిర్దేశించిన సమయంలోనే రావాల్సి ఉంటుందని.. గేటు దగ్గర ఎంట్రీ పుస్తకంలో వివరాలన్నీ రాస్తే.. ఆనుమతించాలా లేదా అనే విషయాన్ని నల్లమల్లారెడ్డి నిర్ణయిస్తారని.. అప్పడే తమకు ఎంట్రీ ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమాత్రం వారిని ప్రశ్నించినా అక్కడివారు తమను కొట్టి పంపేస్తారని ఆరోపించారు.
సింగరేణి కంపెనీలో ఉద్యోగాలు చేసి ప్లాట్లు కొంటే అవసరాలకు తమవి తాము అమ్ముకునేందుకు కూడా అవకాశంలేకుండా చేశారు అని ఆరోపించారు. నల్లమల్లారెడ్డిపై ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ప్రహరీ నిర్మాణానికి అనుమతులు లేవంటూ నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రహరీ కూల్చివేతకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ ఆదేశాలమేరకు అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు. ప్రహరీ కూల్చివేతతో దివ్యనగర్ లేఔట్ ప్లాట్ యజమానులు, ఆ పరిసర ప్రాంతాల్లోని ఇతర లే ఔట్ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. దివ్యనగర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు..ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా – పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడ.
- Advertisement -



