ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలి- అదనపు కలెక్టర్ డి.వేణు

- Advertisement -

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలి- అదనపు కలెక్టర్ డి.వేణు

Everyone should follow road safety norms- Additional Collector D.Venu

పెద్దపల్లి
రోడ్డు పై ప్రయాణించే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని  అదనపు కలెక్టర్ డి.వేణు అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాలు కార్యక్రమంలో    ఆర్.టి.ఓ టి.రంగా రావు తో కలిసి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రమాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి కూడా మార్గదర్శకాలు ఉన్నాయని, ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ ధరించడం, కార్లలో ప్రయాణిం చే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా ముఖ్యమ ని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల పట్ల ప్రజల నిర్లక్ష్య ధోరణి వీడాలని అన్నారు. ప్రతి సంవత్సరం దేశంలో జరిగే లక్షా 70 వేల ప్రమాదాలలో  లక్షా 30 వేల ప్రమాదాలు రొడ్డు భద్రత ప్రమాణాలు పాటించ డం వల్ల నివారించ వచ్చని అన్నారు. హెల్మెట్,  సీట్ బెల్ట్ ధరించడం వల్ల దురదృష్టవ శాత్తు ప్రమాదాలు జరిగినా ప్రాణాలు కాపాడుకోవచ్చు అని అన్నారు. రోడ్డు పై ప్రమాదాలు క్షణ కాలంలో జరుగుతాయని, వీటిలో చనిపోయే వారిలో 75 శాతం పైగా కుటుంబ పోషకులే ఉంటున్నారని, మన  నిర్లక్ష్యం వల్ల మన కుటుంబాలు నష్టపోతున్నారని, ప్రతి ఒక్కరు  రోడ్డు భద్రతా ప్రమాణాల పాటించాలని అన్నారు.  రోడ్డు పై మనం బాధ్యతతో వ్యవహ రించాలని అన్నారు. టి జంక్షన్ దగ్గర ఊర్లలో నుంచి మెయిన్ రోడ్డు కు వచ్చే సమయంలో ఒకటి రెండు సార్లు రొడ్డుకు ఇరు వైపులా చూసుకోవాలని,  ఇతర వాహనాలనం ఓవర్ టేక్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అనం తరం అదనపు కలెక్టర్ అధికారులు సిబ్బంది చే రోడ్డు భద్రత ప్రమాణాల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్  మోటర్ వెహికల్  ఇన్స్ పెక్టర్  ఎం. మధు,  సంబంధిత  ఆర్.టి.ఓ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular