- వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్
వరంగల్ క్రైం, జూలై 11, (వాయిస్ టుడే): మద్యం దుకాణాల పరిసరాల్లో బహిరంగ మద్యం త్రాగిన వారితో పాటు మద్యం షాపు యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. రాత్రి సమయాల్లో మద్యం దుకాణాల పరిసరాల్లోని ఇతర వ్యాపార సంస్థల ముందు ఇష్టానుసారంగా మందుబాబులు బహిరంగంగా మద్యం సేవిస్తూ పరిసర ప్రజలకు ఇబ్బందులకు గురిచేయడంతో పాటు మద్యం దుకాణాల ముందు వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ దృష్టికి పలు ఫిర్యాదులు రావడంతో దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన చేస్తూ.. ఇకపై మద్యం దుకాణాల పరిసరాల్లో బహిరంగంగా ఎవరైన మద్యం సేవిస్తూ, మద్యం దుకాణాల ముందు పార్కింగ్ చేసిన వాహనాల వలన ప్రజలు ఎదైన ఇబ్బందులకు గురౌవుతున్నట్లుగా మీ దృష్టికి వస్తే తక్షణమే ప్రజలు సెల్ఫోన్ ద్వారా ఫోటో లేదా వీడియోను చిత్రీకరించి వరంగల్ పోలీస్ కమిషనర్ వాట్సప్ నంబర్ 8712685100 నంబరుకి పోస్ట్ చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోల ఆధారంగా చర్యలు తీసుంటామని అలాగే మద్యం దుకాణం యజమానులను పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేస్తూ.. మద్యం దుకాణాల పరిసరాల్లో ఎవరు మద్యం సేవించకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిన మద్యం దుకాణం యాజమాన్యంపై వుందని, ముఖ్యంగా మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వారి వాహనాలను సరైన క్రమంలో మద్యం షాపు ముందు పార్కింగ్ చేయించేందుకుగాను ప్రత్యేక వ్యక్తులను నియమించుకోవాలని మద్యం వ్యాపారులకు పోలీస్ కమిషనర్ సూచించారు.