ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండల విద్యాధికారి .ఏ. రాజయ్య*.    

- Advertisement -

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండల విద్యాధికారి .ఏ. రాజయ్య*.

Quality Education in Government Schools Mandal Vidyadhikari .A.Rajayya

కమాన్ పూర్

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని సుల్తానాబాద్ ఎంఈఓ  రాజయ్య అన్నారు. శనివారం                            సుల్తానాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వాసాల శ్రీవాణి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు వాసాల శ్రీలత-శ్రీనివాస్ దంపతులు విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు మరియు పెన్నులు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంఈఓ రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని రేపు ప్రభుత్వం నుండి ఎలాంటి ఉద్యోగాలు గాని ఉపాధి వచ్చిన మొదటి ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకే ఉంటుందని అలాగే ప్రభుత్వం అన్ని విధాల విద్యార్థులకు సౌకర్యాలు కలిగించిందని కావున ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని అన్నారు

ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మా ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్టడీ మెటీరియల్స్ అందిస్తున్నామని దానిలో భాగంగా ఈరోజు శ్రీవాణి పుట్టినరోజు సందర్భంగా మొదటి విడతగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు దాతలైన వాసాల శ్రీలత-శ్రీనివాస్ దంపతులచే అందించడం జరిగిందని వారికి ప్రత్యేక అభినందనలు ఇది సుల్తానాబాద్ మండలం లో ఉన్న ప్రతి గురుకుల మరియు హైస్కూల్లో దాతల సహకారంతోటి పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పాసాల శ్రీనివాస్ పదో తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు నగదు బహుమతిని అందిస్తానని ప్రకటించారు

ఈ  కార్యక్రమంలో.. జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అమ్మిరి శెట్టి శారద మాట్లాడుతూ భావితరాలకు మీరే పునాదిరాళ్లని మేము విద్యను మీకు అందిస్తున్నామని దాన్ని అన్ని విధాల సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థానంలో ఉండాలని ఇప్పుడు మీరు ఎలా అయితే ఈ ప్యాడ్స్ స్వీకరించారో రానున్న రోజుల్లో మీరు అలా ఇచ్చేస్తాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు

అలాగే సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న మూడు హైస్కూల్లో దాదాపు 140 మంది విద్యార్థులకు పరీక్ష ప్లాట్స్ మరియు పెన్నులు అందించడం జరిగినది

ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular