యువతకు ఓటు విలువ చెప్పాలి
Youth should be told the value of vote
సిద్దిపేట
నేటి తరం యువతకు ఓటు యొక్క విలువ మరియు ఎలక్షన్ ప్రక్రియ గూర్చి తెలపాలని
జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యలయంలో నిర్వహించిన 15వ ఓటరు దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా మాస్టర్ ట్రైనర్ అయోధ్య రెడ్డి అందరితో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.
18సంవత్సరాలూ నిండిన ప్రతి ఓక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. నూతన ఓటరు అప్లే కోరకు పామ్-6, అడ్రస్ తారుమారు కోరకు పామ్-8 ఇతరత్ర ఓటరు అప్లే ప్రక్రియ, చేసుకునే విధానాన్ని యువతి యువకులను అడుగుతు తెలిపారు. ఈసీఐ సూచించిన ఆన్లైన్ లో లేదా బూత్ లేవల్ అదికారులను సంబంధిత పత్రాలు ఇచ్చి ఓటరు అప్లే చేసుకోవాలి.
వివిద స్కూల్స్, కళశాల, వివిద విద్యాసంస్థలలో ఎస్ వి ఈఈ పి, కార్యక్రమలలో రెగ్యులర్ గా హాజరుకావాలని మరియు విద్యాసంస్థల లలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ లు ఉన్నాయి వాటి గూర్చి అందరు తెలుసుకోవాలి.
అందరు క్రమం తప్పకుండా ఈసిఐ నిర్వహించిన అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రతి దాంట్లో ఓక భిన్నమైన ఎలక్షన్ ప్రక్రియ ఉంటుంది. మన దేశమనే కాకుండా వివిద దేశాలలో నిర్వహించిన ఎలక్షన్ ప్రక్రియ సైతం భిన్నమైన ప్రక్రియలుగా నిర్వహణ జరుగుతుంది.
ఓటు యొక్క ప్రాముఖ్యత నేటితరం యువత తెలుసుకోవాలని ప్రలోభాలకు గురికాకుండా ఏక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాగాని ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు.
నేటీ తరం యువతకు ఇంట్లో తల్లిదండ్రులు మరియు సమాజంలో విద్యావంతులు ఎలక్షన్ ప్రక్రియ గుర్చి తెలపాలని ఈ ప్రక్రియ గూర్చి అర్థం చేసుకుంటే తనంతట తానే నేరుగా ఓటు హక్కు ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయ్యవద్దు అనే భావన యువత మెదడు లో నిక్షిప్తం అవుతుంది.
ఓటు అనేది ఓక వజ్రాయుధం, మన సమాజం మార్చడానికి ఇదీ ఓక ఆక్సిజన్ అని తెలిపారు.
అనంతరం ఓటరు దినోత్సవం పురస్కరించుకుని వివిధ పాఠశాల మరియు కళశాలలో నిర్వహించిన వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు, మున్సిపల్ కార్యలయంలో నిర్వహించిన ముగ్గుల పోటిలో పాల్గొని విజేతలుగా నిలిచిన మహిళలకు, గ్రామ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బిఎల్ఓ లకు మరియు ఈ కార్యక్రమం నిర్వహణకు కృషి చేసిన సిబ్బంది కి ప్రశంస పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఆక్యుయేషన్, గీత, తహసీల్దార్లు వెంకటేష్ సలీం, మున్సిపల్ కమీషనర్ అశ్రీత్ కుమార్, డిగ్రి కళశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



