Wednesday, February 25, 2026

కేంద్రమంత్రి కట్టర్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన కోతి రాంపూర్ ప్రజలు

- Advertisement -

కేంద్రమంత్రి కట్టర్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన కోతి రాంపూర్ ప్రజలు

People of Kothi Rampur who were happy about Union Minister Cutter's announcement

బిజెపి నేత మాసం గణేష్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు కట్టర్,  బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం

కరీంనగర్
కోతి రాంపూర్ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిన డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ హామీ ఇవ్వడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలను ఇబ్బంది పెడుతూ,  వేధిస్తున్న డంపింగ్ యార్డ్ కు  సమస్యకు పరిష్కారం లభించేలా కృషి చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కి, ఎంత ఖర్చయినా కేంద్రమే భరిస్తుందని ఇటీవల కరీంనగర్ బహిరంగ సభ వేదికగా హామీ ఇచ్చిన కేంద్రమంత్రి కట్టర్ కి  కృతజ్ఞతలు తెలుపుతూ    సోమవారం రోజున కోతి రాంపూర్ బిజెపి నేత మాసం గణేష్ ఆధ్వర్యంలో స్థానికగాంధీ విగ్రహం వద్ద సంబరాలు చేపట్టి, కేంద్ర మంత్రులు కట్టర్, బండి సంజయ్ కుమార్ ల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు కళ్లెం వాసుదేవ రెడ్డి,  మాసం గణేష్ లు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా డంపింగ్ యార్డ్ వల్ల  కోతి రాంపూర్ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని , ముఖ్యంగా అనారోగ్యాల బారిన పాడిన ప్రజలు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్ తో కోతి రాంపూర్ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని, ఈ సమస్యపై అనేకసార్లు పోరాటాలు, విజ్ఞప్తులు చేసిన ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఇటీవల కరీంనగర్ పట్టణంలో జరిగిన బహిరంగ సభ వేదికగా కేంద్రమంత్రి కట్టర్  డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రకటన చేసిన  నేపథ్యంలో కోతి రాంపూర్ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ డంపింగ్ యార్డ్ సమస్యను కేంద్రమంత్రి కట్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేసినందుకు  కోతి రాంపూర్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్  దుబాల శ్రీనివాస్,  సౌత్ జోన్ కన్వీనర్ గాయత్రి, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ శివానందం,  మోహన్, కిరణ్, రమేష్ ,సాగర్ సాయిరాం ,లింగమూర్తి ,సందీప్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్