Saturday, March 28, 2026

మమ్మల్ని అవమానిస్తారా కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

- Advertisement -

మమ్మల్ని అవమానిస్తారా కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

CM Revanth Reddy is angry with the Center for insulting us

హైదరాబాద్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అంబేద్కర్‌ వర్సిటీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ డిజిటల్‌ రిసోర్స్‌ సెంటర్‌ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాజ్యాంగ పరిరక్షణపై చర్చ జరగడం దురదృష్టకరమని, అంబేద్కర్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇదని కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహిస్తూ. ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని సీఎం విమర్శించారు. కేంద్రం నూతన యూజీసీ నిబంధనలు మార్చాలని, రాష్ట్రాల హక్కులు గుంజు కోవడం మంచిది కాదని అన్నారు. వీసీలను తమ పరిధిలోకి తీసు కోవాలని కేంద్రం కుట్ర చేసిందన్నారు. తాము వీసీల నియామకంతోనే సరిపెట్టుకోలేదని, వర్సిటీల్లో వీసీ ఖాళీల భర్తీకి ఆదేశించామని చెప్పారు. తెలంగాణ సమాజం తమకు మరో పదేళ్లు అవకాశమిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు.

కేంద్రం కుట్రలను అడ్డుకుంటాం:

పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, వివక్ష కనిపించిందని, ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ పేర్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానమని, 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. తెలంగాణకు కనీసం 5 పురస్కారాలు కూడా రాలేదని ఆరోపించారు. పద్మ అవార్డుల విషయంలో ప్రధాని మోదీకి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నూతన యూజీసీ నిబంధనలపై పోరాడుతామని, రాష్ట్రాల హక్కులు గుంజుకోవడం మంచిది కాదని, కేంద్రం కుట్రలను అడ్డుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్