భూ కబ్జాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

- Advertisement -

భూ కబ్జాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

Legal action should be taken against the land grabbers

-ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
హైదరాబాద్
నకిలీ పత్రాలు సృష్టించి తమ స్థలాలను అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై  చట్టపరంగా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు జుబేర్ అక్రమ్, రామ్ రెడ్డి, చెరుకు శివారెడ్డి, ముత్తారెడ్డి లు మాట్లాడారు. మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 739 నుంచి 749 లో గల స్థలాలను 1985 సంవత్సరంలో  వెంచర్ చేయగా వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించిన తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. సదరు భూమిపై కన్నేసిన కబ్జాదారులు నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి స్థానిక  అధికారులను ప్రలోభాలకు గురిచేసి తమ భూములను వ్యవసాయ భూములుగా చూపుతూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీంతో తాము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తమకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం బే ఖాతరు చేస్తూ తమ స్థలాల్లోకి తమను వెళ్లకుండా గుండాలచే అడ్డుకుంటున్నారని వాపోయారు. కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలంలో ఇళ్లను నిర్మించుకుంటే భారీ జెసిబి లతో నిలవటం చేశారని విలపించారు. పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడికి వచ్చారని చెప్పారు. విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా మాట్లాడుతుండడంతో వారించే ప్రయత్నంలోనే ఘర్షణ చోటుచేసుకుందని అన్నారు. వెయ్యి మందికి పైగా బాధితులు ఉన్న ఈ అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ముత్తారెడ్డి శ్రీనివాస్ వెంకటేష్ నిర్మల కళ్యాణి రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular