Thursday, March 5, 2026

చంద్రబాబు కృషి తో ఏపీకి పరిశ్రమలు

- Advertisement -

చంద్రబాబు కృషి తో ఏపీకి పరిశ్రమలు

Industries for AP with the efforts of Chandrababu

అరకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి సియ్యారి దొన్నుదొర
అరకులోయ
రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతం అయిందని అరకు టీడీపి ఇన్చార్జి సియ్యరి దొన్ను దొర అన్నారు.విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలవడం చంద్రబాబు కృషి కు నిదర్శనమని 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఎముకాలను కొరికే -6 డిగ్రీ చలిలో చైతం లెక్కచేయకుండా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ పడిన శ్రమ సత్ఫలిస్తున్నాయని చెప్పారు.మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ టాటా చైర్మన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సైతం సీఎం చంద్రబాబు విజన్ ను మెచ్చుకోవడం రాష్ట్రంలో పెట్టుబడి పెడతామని హామీ ఇవ్వడంతో చంద్రబాబు విజన్ 2047 విజయాని సూచిస్తోందన్నారు.దావోస్ లో పర్యటించిన నాలుగు రోజుల్లో చంద్రబాబు ,లోకేష్  పారిశ్రామికవేత్తలను కావలిసినంత గా గతంలో జగన్ మోహన్ రెడ్డి కలిసి ఉండరని ఒక జూమ్ కాల్ తో అర్చెలార్ మిట్టల్ &  నిప్పార్ స్టిల్ కంపెనీలతో మాట్లాడి రాష్ట్రానికి 1.40 లక్షల కోట్లు పెట్టుబడులు తిసుకొచ్చిన ఘనత నారా లోకేష్ దన్నారు.జనవరి 8న విశాఖలో రూ.2లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని టీసిఎస్,  బీపీసీఎల్, రిలయన్స్,  గ్రీన్ కో ఆర్సెలార్ మిట్టల్  & నిప్పాన్  స్టీల్, పిప్పల్ టెక్, వంటి ఎన్నో పరిశ్రమలు ఇప్పటికి మన రాష్ట్రానికి  పెట్టుబడులు పెట్టబడుతున్నాయన్నారు.2019లో వైసీపీ వచ్చాక బ్రాండ్ ఏపీ గా ఉన్న మన రాష్ట్రాన్ని బిల్డప్ ఏపీ గా జగన్మోహన్ రెడ్డి మారిస్తే తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకునేల సన్ రైజ్ ఏపీ గా నేడు చంద్రబాబు మార్చారన్నారు.యువ నాయకుడు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జనవరి 27వ తేదిన యువతకు భరోసాగా పాదయాత్ర మొదలు పెట్టడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం నేడు యువతకు 20 లక్షల ఉద్యోగ కల్పన లక్ష్యంగా రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తున్నారని చెప్పారు.
ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని అలాగే పాఠశాలలో మార్పు తీసుకురావడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ గురు, అరకు వ్యాలీ నియోజకవర్గ ఎస్ సి సెల్ అధ్యక్షులు కృపనందం,కాశిపట్నం ఎంపిటిసి  సన్యాసి రావు, తెదేపా నాయకులు జానకేశ్వర రావు, సందీప్, తామల రాంబాబు, వంతల వెంకట రావు, పాంగి రవీంద్ర, ఎర్రిబాబు, ధర్మ పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్