సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తాం జువ్వాడి  నర్సింగారావు, జువ్వాడి కృష్ణారావు

- Advertisement -

సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తాం జువ్వాడి  నర్సింగారావు, జువ్వాడి కృష్ణారావు

Juvvadi Narsinga Rao, Juvvadi Krishna Rao will work for community development

కోరుట్ల
:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాల యువజన సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. సోమవారం కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన యువజన సంఘం కు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శి, పాలకమండలి సభ్యులు జువ్వాడి  నర్సింగా రావు, జువ్వాడి కృష్ణారావు లను వేరువేరుగా కలిసి  శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ గతంలో జువ్వాడి రత్నాకర్ రావు  సంఘ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన నిధులతోనే సంఘ  భవనము నిర్మాణము ప్రారంభం జరిగిందని అన్నారు. రత్నాకర్ రావు సంఘ అభివృద్ధికి చేసిన సేవలను తమ సంఘ సభ్యులము మర్చిపోమన్నారు. ఈ సందర్భంగా జువ్వాడి బ్రదర్స్ మాట్లాడుతూ  సంఘానికి సంబంధించిన మిగతా అభివృద్ధి పనుల కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు పొట్ట లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు గోరుమంతల సత్తయ్య, ప్రధాన కార్యదర్శి బలిజ సంతోష్ కుమార్, కోశాధికారి సామల వేణుగోపాల్, సహాయ కార్యదర్శి కండ్ల మైఖేల్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘాల నాయకులు బలిజ రాజారెడ్డి, బద్ది మురళి, మోర్తాడ్ లక్ష్మీనారాయణ,  తేలు కంటి శంకరయ్య తదితరులు ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular