- Advertisement -
అనుమానాస్పద స్థితిలో మరో విద్యార్థిని ఆత్మహత్య
Another student commits suicide under suspicious circumstances
శంషాబాద్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శాస్త్ర ది గ్లోబల్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల పై నుండి దూకి నీరజ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యా కు పాల్పడి మరణించింది.. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం లోని బాలికల రెసిడెన్షియల్ వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న ఆరాధ్య అనే విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో ఊరి వేసుకుని ఆత్మహత్య కి పాల్పడింది.. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నా తరుణం లో తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతాను అనే భయం తో ఆత్మహత్యా కి పాల్పడి ఉండవచ్చని అక్కడి వారు భావిస్తున్నారు. ఆత్మహత్యా కి గల కారణాలు తెలిసేది ఉందని పోలీసులు తెలిపారు..ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.బాలిక మృతదేహం షాద్ నగర్ ప్రభత్వ ఆసుపత్రి మార్చురీ లో ఉన్నట్లు తెలిపారు..
- Advertisement -



