బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి

- Advertisement -

బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి

BCs should be given 50% reservation in legislatures

దేశ జనగణలో కులగణన జరపాలి

బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్

కరీంనగర్
పార్లమెంట్ సమావేశంలో బీసీలకు 50 శాతం చట్టసభలలో రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలు పరచాలని, దేశ జన గణనలో కుల గణన దేశవ్యాప్తంగా జరపాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు  కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ భారత దేశములో ప్రజలందరికీ జాతి కుల, వర్గ,లింగ వివక్ష లేకుండా సమానత్వాన్ని సమాన హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చి కేంద్రంలో సగానికి పైగా ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను పెరగకుంటే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి జరగాలంటే అన్ని రంగాల్లో సంపదలో వికేంద్రీకరణ జరగాలని దేశంలో జంతు గణనలతో పాటు అన్నింటిని లెక్కలు తీయాలని సగానికి పైగా ఉన్న బీసీ కులగణన లెక్కలు తీయమంటే కేంద్ర ప్రభుత్వo కుంటి సాకులుచెబుతూ సాంకేతిక లోపాలు వస్తాయని చెబుతుందని కానీ అది ఏ మాత్రం నిజం కాదని అన్నారు. బీసీ కుల గణన చేసి విద్య ఉపాధి రంగాలలో మేమెంతో మాకంత వాటా కల్పించాలని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు 50 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలు పరచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, రెండు లక్షల కోట్లతో బీసీ సంక్షేమ అభివృద్ధి కొరకు బడ్జెట్లో వెంటనే నిధులు కేటాయించి బీసీలను ఆదుకోవాలని , కుల వృత్తి పని చేసుకునే బీసీలకు సబ్సిడీ రుణాలు  ఇవ్వాలని, బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించాలని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బుచ్చన్న ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో గురువారం కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య కోశాధికారి పైడిపల్లి రాజు, నాయకులు గోదారి లక్ష్మణ్, అల్లపు రాజు, శ్రీనివాస్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular