- Advertisement -
ఎస్ వి అగ్రికల్చర్ యూనివర్సిటీ కి బాంబు బెదిరింపు
Bomb threat to SV Agriculture University
తిరుపతి
తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. హ్యూమన్ ఐ ఈ డి బాంబు పేరుతో పేల్చేస్తామంటూ గురువారం ఉదయం కళాశాల మెయిల్ కు సందేశం వచ్చింది. అప్రమత్తత అయిన ఎస్ వి అగ్రికల్చర్ కళాశాల సిబ్బంది, కళాశాల అధికారులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసారు. అగ్రికల్చర్ కళాశాలకు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో చేరుకుని తనిఖీలు జరిపారు. కేరళ రాష్ట్రం నుండి మెయిల్ వచ్చినట్టు కళాశాల సిబ్బంది చెబుతున్నారు. గత రెండు నెలల క్రితం కూడా తమిళనాడు రాష్ట్రం నుండి మెయిల్ వచ్చింది. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో కళాశాలలోని పలు ప్రాంగణాలలో తనిఖీలు కొనసాగాయి.
- Advertisement -



