శభాష్ నరసింహారావు.. క్రీడా సేవలు అభినందనీయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

- Advertisement -

శభాష్ నరసింహారావు.. క్రీడా సేవలు అభినందనీయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Sabhash Narasimha Rao.. Sports services appreciated: Government Whip Adi Srinivas

వేములవాడ (వాయిస్ టుడే): గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నామా నరసింహారావు చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ కబడ్డీ పోటీల సందర్భంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు నామా నరసింహారావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

సూర్యాపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి శిక్షణ, ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారని ఆది శ్రీనివాస్ ప్రశంసించారు. కబడ్డీ అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి నామా నరసింహారావు చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి, అధ్యక్షుడు కాసాని వీరేష్, చీఫ్ అడ్వైజర్ జగదీష్ యాదవ్, అంతర్జాతీయ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular