మహిళల, బాలికల భద్రతకు “భరోసా” పెద్దపీట జిల్లా కలెక్టర్

- Advertisement -

మహిళల, బాలికల భద్రతకు “భరోసా” పెద్దపీట జిల్లా కలెక్టర్

'Bharosa' for the safety of women and girls Peddapeta District Collector

ఆదర్శ్ సురభిహిళలు, పిల్లలు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రండి, వేధింపుల నుండి బయటపడండి.

భరోసా ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో భరోసా సిబ్బంది సేవలను కొనియాడిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి

భరోసా కేంద్రం ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఐఏఎస్  అన్నారు.

వనపర్తి పిబ్రవరి-06:  అత్యాచార బాధితులకు, వైద్య,న్యాయ, సైకాలజికల్ సపోర్టు, వంటి సేవలు ఒకే గొడుగు కింద అందిస్తున్న పోలీస్ శాఖ ఉమెన్స్ సేఫ్టీ వింగ్  ఆధ్వర్యంలో నడుపుతూ  సేవలందించి, జిల్లా ప్రజల మన్ననలు పొందిన   వనపర్తి జిల్లాలో భరోసా కేంద్రం ప్రారంభమైన తేది: 06-02-2024 నుండి అనగా  ఒక  సంవత్సరం ఇప్పటి వరకు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్బంగా భరోసా కేంద్రం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధితులుగా హాజరైన జిల్లా కలెక్టర్, ఆదర్శ సురభి ఐఏఎస్   జిల్లాఎస్పీ  రావుల గిరిధర్ ఐపీఎస్  జిల్లా అదనపు  కలెక్టర్ శ్రీ సంజిత్ గంగ్వార్ ఐఏఎస్   సంబంధిత అధికారులతో  కలిసి కేక్ కట్ చేశారు

ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ..  మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను దృష్టిలో ఉంచుకొని, అన్ని రకాల సేవలను ఒకే గొడుగు క్రింద అందించాలన్న సంకల్పంతో  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వనపర్తి జిల్లాలో భరోసా కేంద్రాన్ని తేది: 06.02.2024, నాడు ప్రారంభించడం జరిగిందన్నారు.
భరోసా సెంటర్ నందు శిక్షణ పొందిన సిబ్బంది, భాదిత మహిళలను అక్కున చేర్చుకొని వారిలో కొండత ధైర్యాన్ని నింపుతూ.., సమస్యలతో భరోసా సెంటర్ కు వచ్చిన వారికి  నిష్ణాతులైన కౌన్స్లర్ లచే కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు, పోక్సో మరియు అత్యాచార కేసుల్లో భాదిత మహిళలకు అన్ని రకాల సేవలు (మెడికల్, లీగల్ మరియు కాంపెన్సేషన్) ఒకే వేదికగా అందిస్తూ, భాదితులకు బాధ నుండి విముక్తి కల్పిస్తూ సత్వర న్యాయం చేకూరేలా సేవలందిస్తున్న భరోసా సిబ్బంది సేవలను కలెక్టర్  కొనియాడారు.

ఈ సందర్బంగా ఎస్పీ  మాట్లాడుతూ… భరోసా కేంద్రం ద్వారా పోక్సో మరియు మహిళల పై అత్యాచార కేసులను నియంత్రించడానికి స్కూల్, కళాశాల లలో తరుచూ అవగాహన (prevention of child sexual abuse) కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పోక్సో కేసు నమోదు అయినప్పటి నుండి చివరి వరకు బాధితులకు అండగా వుంటూ, నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే భరోసా ముఖ్య ఉద్ధేశ్యం అన్నారు.  తమకు జరిగిన అన్యాయం గురించి నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు నమోదు చేయాలని, న్యాయస్థానం ముందు దోషులకు శిక్ష పడినప్పుడే తిరిగి నేరం చేయడానికి వెనకడుగు వేస్తారని అన్నారు. భరోసా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, రాత్రి పగలు అని తేడా లేకుండా ఎళ్లవేలలా పిల్లల, మహిళల రక్షణకు అందుబాటులో ఉండాలని సూచించారు.  బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయకుండా  అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయంతో విధులు నిర్వహించాలని అన్నారు.  జిల్లాలో భరోసా సెంటర్ ప్రారంభమైన నాటి నుండి సత్ ఫలితాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న భరోసా సిబ్బందిని, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సిడబ్ల్యుసి, సఖీ సెంటర్ తదితర డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో

భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని ఎస్పీ తెలిపారు. ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో న్యాయ సలహాలు, వైద్యం, సైకాలజీ తదితర సేవలు అదించడం జరుగుతుందని  అన్నారు. నిరాదరణకు గురైన మహిళలు బాలలకు భరోసా కల్పించేందుకు  వనపర్తి జిల్లాలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 47కేసులు నమోదు కాగా 37 ఫోక్సో కేసులు ఉన్నాయని అన్నింటికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న 12 మంది బాధిత మహిళలకు 87,500/- రూపాయలు అందించడం జరిగిందనీ. పిల్లలకు 24/7 సేవలు అందిస్తుందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ గార్లు  భరోసా బాధితులకు చెక్కులను అందజేశారు

ఈ కార్యక్రమంలో  వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్, సంజిత్ గగ్వార్, వనపర్తి  డీఎస్పీ, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పి, ఉమామహేశ్వరరావు,  జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి, సుధారాణి, వనపర్తి సీఐ, కృష్ణ, వనపర్తి పట్టణ ఎస్సై, హరిప్రసాద్, వనపర్తి రూరల్ 2వ ఎస్సై, బాలయ్య, ట్రాఫిక్ ఎస్సై, సురేందర్,  భరోసా కేంద్రం కోఆర్డినేటర్, శిరీష, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, రాంబాబు, భరోసా సిబ్బంది, భరోసా బాధితులు, షీ టీం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular