కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగం, సంక్షేమ రంగాలకు నిధులు కేటాయింపులు పెంచాలి

- Advertisement -

కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగం, సంక్షేమ రంగాలకు నిధులు కేటాయింపులు పెంచాలి

Fund allocations for agriculture and welfare sectors should be increased in the central budget

తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలు దగ్ధం

కొణిజర్ల
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగం సంక్షేమ రంగాలకు అవసరమైన మేరకు నిధులు కేటాయింపులు పెంచాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు దొడ్డపనేని కృష్ణార్జున్ రావు అన్నారు. గురువారం కొణిజర్ల మండలం సింగారయపాలేం లో తెలంగాణ రైతు సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ రంగం కు ఎరువులు సబ్సిడీ 4 వేల కోట్లు, ఫసల్ భీమా కు మూడు వేల కోట్ల రూపాయలు గంత కంటే కోత పెట్టాడం పై బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు దొడ్డపనేని కృష్ణార్జున్ రావు మాట్లాడుతూ  వ్యవసాయ , గ్రామీణాభివృద్ధి, సంక్షేమ రంగాలకు నిధులు కేటాయింపులు తగ్గించి, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ప్రోత్సాహకాలు అందించే విధంగా బడ్జెట్ ఉందని అన్నారు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మిద్దె రామారావు, వడ్లమూడి మధు, రామకృష్ణ మట్టా వెంకటేశ్వరరావు,అనుమోలు వెంకటేశ్వరరావు, బుజ్జి,జాజివేలి, వెంకన్న, నాగులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular