- Advertisement -
నకిలీ డాక్యుమెంట్లతో భూఆక్రమణ… ఇద్దరు వ్యక్తుల అరెస్టు..
Land occupation with fake documents... Two persons arrested..
జమ్మికుంట
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన షేక్ సాబీర్ అలీ, కాటిపల్లి రాజు, అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి, ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ వరగంటి రవి, తెలిపిన వివరాల ప్రకారం. ఎండి ఆరిఫ్ఉద్దీన్ అనే వ్యక్తి తనకు ఉన్నటువంటి సర్వేనెంబర్ 464 ప్లాట్ నెంబరు 4 భూమి విషయంలో కాటిపల్లి రాజు, కాటిపల్లి సంధ్య, కాటిపెల్లి లక్ష్మి, లు అక్రమంగా ప్రవేశించి ఎలాంటి పత్రాలు లేకుండా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి దొంగ డాక్యుమెంట్లు తయారుచేసి ఆ స్థలంలో టెంటు వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నారని భూమి యజమాని ఎండి ఆరిఫ్ఉద్దీన్, పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ వరగంటి రవి తెలిపారు. వీరికి మద్దతుగా సామాజికవేత్త ముసుగులో షేక్ సాబీర్ అలీ, కాటిపల్లి రాజు, అనే వ్యక్తులు భూ యాజమానిని భయభ్రాంతులకు గురిచేసినట్లు వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకే వీరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ తెలిపారు. ఈ సందర్భంగా జమ్మికుంట సిఐ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా శిక్ష తప్పదని సామాజికవేత్త ముసుగులో అక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులు తనకు సంబంధం లేని ఒక భూ వివాదంలో తలదూర్చి భూ యజమానిని ఇబ్బందులకు గురి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేయడంతో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో షేక్ సాబీర్ అలీ, కాటిపల్లి రాజు,ల పై కేసు నమోదు చేశామన్నారు, చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుక పోతుందని ప్రజలకు ఇబ్బందులు కలిగించే అలాంటి వారిపై ఉపేక్షించేది లేదని సిఐ వరగంటి రవి విలేకరుల సమావేశంలో తెలిపారు
- Advertisement -



