- Advertisement -
గండవరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపు
Removal of YS Rajasekhar Reddy statue in Gandavaramనెల్లూరు
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో టిడిపి నాయకులు పౌరసరఫరాలశాఖ రాష్ట్ర డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని తొలగించడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది, ఈసందర్భంగా టిడిపి నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా, ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతూ ఉండడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించామని అన్నారు. దీనికితోడు ప్రముఖ శైవక్షేత్రమైన గండవరం ఉదయకళేశ్వరుని రథోత్సవం, కల్యాణోత్సవం పురస్కరించుకొని గ్రామంలో భారీ ఎత్తున ప్రజలు హాజరవుతారని ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా గ్రామంలో రోడ్డుపక్కన ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు.. కోవూరు నియోజకవర్గం లో ఇప్పటికే వైసిపి టిడిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపుతో గ్రామంలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి, అలాగే వైసిపి పార్టీవారు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
- Advertisement -




