డెడికెటేడ్ కమిటి రిపోర్టు బయటపెట్టాలి
బీసీ రిజర్వేషన్ల బిల్లు పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్
Dedicated Committee report should be made public: BRS MLC Kalvakuntla
బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదు,వి.పి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చేయలేదు. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్చిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ వాదించారు. రూ. 4300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేయించింది కానీ ఆ నివేదికను ఇప్పటివరకు బయట పెట్టలేదు, ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎందుకు మాట్లాడలేదు? బీసీ వర్గీకరణ కోసం మోడీ ప్రభుత్వం వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అసలు ఈ 42 శాతం అన్న లెక్కకు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన వచ్చిందో సమాధానం చెప్పాలి. ఏ కారణం చేత 42 శాతమని నిర్ణయానికి వచ్చారు ఎందుకు చెప్పడం లేదు? అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల పాటు కాలయాపన చేసి తమ పోరాటాలతో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషనన్ ను నియమించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదు, నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలి. కులాల వారీగా, గ్రామాల వారిగా బీసీ జనాభాను ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదు? బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుంది. బిల్లులో కేటగిరీ వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు, ఏ గ్రూపుకు ఎంత రిజర్వేషన్లు కేటాయిస్తారన్న వివరాలు లేవని అన్నారు.
న్యాయపరమైన చిక్కుల్లో ఈ చట్టాలు ఇరుక్కోవద్దన్నది తమ అభిమానం. చిన్న చిన్న విషయాల మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే చట్టాలను కొట్టివేసే ప్రమాదం ఉంది. బీసీ సబ్ ప్లాన్ ను ప్రభుత్వ రూపొందించాలి. బీసీలకు ఏటా రూ 20 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి గత ఏడాది కేవలం 9200 కోట్లను మాత్రమే కేటాయించిన ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే అభివృద్ధిలో దేశం అమెరికాను దాటిపోయేదని అన్నారు.
మనంతల మనమే 50 శాతం జనాభాను అవకాశాలకు ఇన్ని సంవత్సరాల పాటు దూరం పెట్టడం బాధాకరం. బిసి, ఎస్సీ, ఎస్టి, మహిళలకు అవకాశాలు దక్కితేనే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుంది ఎంతోమంది పోరాట వీరులు, త్యాగదనులు ఉన్నటువంటి బీసీ వర్గాలకు అందాల్సిన అవకాశాలు ఇంకా అందలేదు. ఉద్యోగ అవకాశాల్లో జాతీయస్థాయిలో 27 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా 23% ఎప్పుడు భర్తీ కాలేదు. యూపీఎస్సీలో 27% బీసీలకు రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎప్పుడూ 8 శాతం అవకాశాలు కూడా దక్కలేదు. బీసీ వర్గాలు ఆర్థిక అసమానతలు కూడా ఎదుర్కొంటున్నారు. దేశంలో 50% జనాభా ఉన్న బీసీల వద్ద కేవలం 15% మాత్రమే సంపద ఉంది. ఈ అసమానతలను సరి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భిన్న వృత్తుల సమూహారమైన బీసీ వర్గాలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి. కుల వృత్తుల వారు సంప్రదాయ ఆదాయ వనరులను కోల్పోయారు. అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఆర్థిక సాధికారత కల్పించడానికి కృషి చేయకపోవడం బాధాకరమనిఅన్నారు.



