మరో ఎమ్మెల్సీ ఎన్నిక
హైదరాబాద్, మార్చి 24
Another MLC election

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ వచ్చింది. ఈ సారి హైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ జరగనుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ప్రభాకర్ రావు పదవి కాలం ముగుస్తోంది. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
ఎమ్మెల్సీఎన్నిక షెడ్యూల్ ఇదీ
28 మార్చ్ – నోటిఫికేషన్
ఎప్రిల్ 04 – నామినేషన్ చివరి తేదీ..
ఎప్రిల్ 07- నామినేషన్ స్క్రూటిని
ఎప్రిల్ 09- నామినేషన్ ఉపసంహరణ గడువు
పొలింగ్ – ఎప్రిల్ 23
కౌంటర్ – ఎప్రిల్ 25
హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి సుదీర్ఘ కాలంగా ప్రభాకర్ రావు ఎమ్మెల్సీగా ఉన్నారు. మొదట్లో ఆయన కాంగ్రెస్ తరపున గెలిచారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. మళ్లీ ఆ పార్టీ తరపున గెలిచారు. అయితే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి ఫిరాయించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇస్తుందా లేద అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. హైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల సభ్యులంతా కలిసి ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. హైదరాబాద్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ లేదు. మజ్లిస్ పార్టీకి బలం ఉంది కానీ.. గెలించే మద్దతు లేదు.. కానీ మూడు పార్టీలు గెలిస్తే ఆ పార్టీకి గెలుపు వస్తుంది.. ముఖాముఖి పోరు జరిగితే మాత్రం ఇతర పార్టీల ఓట్లు కావాల్సి వస్తుంది.అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ స్థానాన్ని మజ్లిస్ కు ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ స్థానం మజ్లిస్ సభ్యుడిది. ఆయన రిటైరైనా.. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ కు అవకాశం కల్పించలేదు. సీపీఐ నేతకు ఎమ్మెల్సీ ఇచ్చారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ మజ్లిస్ కు ఇచ్చే ఒప్పందం మీదనే వారు ఎలాంటి డిమాండ్ చేయలేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మజ్లిస్ కు కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీఆర్ఎస్ కూడా పోటీ చేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు మజ్లిస్ ఎమ్మెల్సీ అభ్యర్థినే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.