పోలీస్ స్టేషన్‌కు శ్రీరెడ్డి… చంద్రబాబు, పవన్ మీద కామెంట్స్ కేసులో నోటీసులు

- Advertisement -

పోలీస్ స్టేషన్‌కు శ్రీరెడ్డి…
చంద్రబాబు, పవన్ మీద కామెంట్స్ కేసులో నోటీసులు
విజయవాడ, ఏప్రిల్ 21

Sri Reddy to the police station...
Notices issued against Chandrababu, Pawan in the comments case

శ్రీ రెడ్డి  కెరీర్ మొదలైంది టీవీ ప్రజెంటర్ కింద! ఆ తర్వాత సినిమాల్లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. అయితే… సినిమాల కంటే ఫిలిం ఛాంబర్ ముందు నగ్న ప్రదర్శనతో పాటు సోషల్ మీడియాలో తెలుగు‌ దేశం,‌‌ జనసేనపై, ఆయా పార్టీల అధినేతలపై చేసిన కామెంట్స్ ద్వారా ఎక్కువ పాపులర్ అయ్యారు. వైసీపీ అండ చూసుకుని ఆవిడ చేసిన కామెంట్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేశాయి. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో విపక్షాల మీద శ్రీ రెడ్డి విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నారా లోకేష్ మీద సైతం కామెంట్స్ చేశారు. పలువురు నాయకుల మీద రాయలేని భాషలో ఆవిడ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కంప్లైంట్ చేశారు. ఆమె ఫిర్యాదు తీసుకున్న అనకాపల్లి పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. పోలీసుల నుంచి నోటీసులు రావడంతో విజయనగరంలోని పూసపాటి రేగ పోలీస్ స్టేషన్ దగ్గరకు తన న్యాయవాదులతో శ్రీరెడ్డి హాజరు అయ్యారు. తనను అరెస్టు చేయకుండా ఉండాలని హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడంతో… శ్రీరెడ్డికి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసులు. అవసరమైతే విచారణకు మళ్ళీ పిలుస్తామని, రావాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలిసింది.
శ్రీ రెడ్డి చుట్టూ నెమ్మదిగా ఉచ్చు బిగుస్తోందా?
ఇప్పుడు ఆర్డర్స్ తెచ్చుకున్నా భవిష్యత్తులో అరెస్టు??
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో… ఆ పార్టీ నాయకుల అండ చూసుకుని విపక్షాలపై కొందరు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. బూతులు మాట్లాడేందుకు సైతం వెనకంజ వేయలేదు. అప్పట్లో హేయమైన వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళిని కొన్ని రోజుల క్రితం ఏపీ పోలీసులు అరెస్టు చేయడం, ఆ తరువాత ఆయన బెయిల్ మీద బయటకు రావడం తెలిసిన విషయాలే.పోసాని అరెస్టు తరువాత శ్రీ రెడ్డిని అరెస్ట్ చేస్తారని అప్పట్లోనే కాస్త బలమైన ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతానికి తనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు నుంచి శ్రీరెడ్డి ఆర్డర్స్ తెచ్చుకున్నప్పటికీ… భవిష్యత్తులో ఆమెను అరెస్టు చేయడం ఖాయమనేది రాజకీయ వర్గాలలో వినపడుతున్న కథనం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే శ్రీ రెడ్డి అరెస్ట్ కాలేదు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular