రజతోత్సవ సభాస్థలిని పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Former Minister Singireddy Niranjan Reddy inspects the Silver Jubilee venue
భారత రాజకీయ చిత్రపటంలో వరంగల్ సభ చారిత్రాత్మకంగా నిలుస్తుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి వచ్చే పార్టీ శ్రేణులకు ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి.
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వరంగల్
ఈనెల 27న జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా బి.ఆర్.ఎస్ శ్రేణులు తరలిరావడానికి రూట్ మ్యాప్ మాజీ ఎం.ఎల్.ఏ పెద్ది.సుదర్శన్ తో* కలసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కె.సి.ఆర్ ఎన్నో చారిత్రాత్మక సభలు నిర్వహించారని అంతకు మించి సభను నిర్వహించి బి.ఆర్.ఎస్ తన రికార్డును మరోసారి రుజువు చేసుకోబోతున్నదని అన్నారు. పది లక్షల మందికి తగ్గకుండా ఉండే ఈ సభకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు.
రాష్ట్ర సాధకుడు కె.సి.ఆర్ చేయబోయే దిశా నిర్దేశం కోసం తెలంగాణ ప్రజలే కాక యావత్ భారత ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేస్తారని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
నిరంజన్ రెడ్డి వెంట జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మండల,పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,వనం.రాములు,మాణిక్యం,రాళ్



