కలకలం రేపిన జంట హత్యలు
గాజువాక
Shocking double murders
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్ లో భార్యాభర్తల జంట హత్యలు స్థానికంగా కలకలం రేపింది.
అత్యంత కిరాతకంగా రిటైర్డ్ డాక్ యార్డ్ ఉద్యోగి యోగేంద్ర బాబు అతని భార్య లక్ష్మిని కత్తులతో దాడి చేసి నిందితుల పరారయ్యారు. బెడ్ రూమ్ లో ఉన్న భార్య లక్ష్మీని గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. సంఘటనా స్థలం పరిసరాల ప్రకారం చూస్తే బెడ్ రూమ్ లో ఉన్న భార్య లక్ష్మి ఒంటి పైన నగలు దోచుకు వెళ్తూ అడ్డు వచ్చిన భర్త రిటైర్డ్ డాక్ యార్డ్ ఉద్యోగి యోగేంద్ర పై ఎనిమిది కత్తిపోట్లును పోలీసు గుర్తించారు. గురువారం సాయంత్రం 8:30 నుండి 9:30 ప్రాంతంలో ఆ ఇంట్లో నుండి కాపాడమని, రక్షించమని కేకలు కూడా వినిపించాయి అని స్థానికులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ అనుకుని మృతుడు యోగేంద్ర కేకలను స్థానికులు పట్టించుకోలేదు. నాలుగు రోజులు హైదరాబాదులో కార్యక్రమానికి వెళ్లి వచ్చి భార్యాభర్తల హత్యకు గురయ్యారు. కుమారుడు, కుమార్తె అమెరికాలో సెటిల్ అవ్వగా యోగేంద్ర బాబు లక్ష్మి దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం నాడు మేనల్లుడు ఇంటికి వచ్చి చూడగా, ఇంటి బయట తలుపులకు తాళం వేసి ఉండడం గమనించాడు.. కాసేపటికి స్థానికులు మేనల్లుడికి సమాచారం అందించడంతో వచ్చి చూడగా రక్తపుమడుగులో యోగేంద్ర బాబు,లక్ష్మి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు లక్ష్మీ ఒంటిపై నగలను కూడా దుండగులు మాయం చేశారు. పక్కా ప్లాన్ తో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులపై దుండగులు దాడి చేసి బంగారం నగలు ఎత్తుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. యోగేంద్ర బాబు ఇంటి ముందర ఉన్న స్కూటీ లేకపోవడంతో కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. నిందితులు హత్య చేసి, తర్వాత ఇంటికి తాళం వేసి స్కూటీపై పరారైనట్టు కూడా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భావిస్తున్నారు. నిందితులు వెంట తెచ్చుకున్న కత్తులను కూడాను తీసుకువెళ్లిపోవడం గమన్హరం.



