కరీంనగర్ లో హెడ్ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి…

- Advertisement -

కరీంనగర్ లో హెడ్ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి…
ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందంటున్న స్నేహితులు…
హత్యేనని  పోలీసులకు ఫిర్యాదు చేసిన పేరెంట్స్
కరీంగనర్

Head nurse dies under suspicious circumstances in Karimnagar...

కరీంనగర్ లోని జ్యోతినగర్ లో నివాసం ఉండే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా పనిచేసే ఝాన్సీ అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం సృష్టిస్తోంది.
పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన ఝాన్సీ కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హెడ్ నర్స్ గా పని చేస్తున్నారు. జ్యోతినగర్ లో స్నేహితులతో కలిసి రూమ్ లో ఉంటుండగా రాత్రి ఇంజెక్షన్ తీసుకుని సూసైడ్ చేసుకుందని రూమ్ మెంట్స్ తెలిపారు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. ఝాన్సీ పేరెంట్స్ మాత్రం ఆత్మహత్య కాదు హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొన్న రాత్రి ఓ అబ్బాయితో ఫోన్లో మాట్లాడిందని రూమ్ మెంట్స్ తెలిపారు. ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. టూ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular