Wednesday, March 11, 2026

తెలంగాణను దోచుకున్న దొంగలు బిఆర్ఎస్ నాయకులు

- Advertisement -

తెలంగాణను దోచుకున్న దొంగలు బిఆర్ఎస్ నాయకులు
తెలంగాణ ఆర్థిక పరిస్థితిని నిజాయితీగా వివరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈటల హాఫ్ బిజెపి.. హాఫ్ బిఆర్ఎస్
కెసిఆర్ చేసిన అప్పులకు నెలకు రూ.7 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి
హరీష్ రావును కరివేపాకులా పక్కన పెట్టారని అద్దంకి దయాకర్
హైదరాబాద్ మే 6

BRS leaders are the thieves who looted Telangana

తెలంగాణ ఆర్థిక పరిస్థితిని నిజాయితీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారని ఎమ్ ఎల్ సి అద్దంకి దయాకర్ తెలిపారు. ఈటల హాఫ్ బిజెపి.. హాఫ్ బిఆర్ఎస్ అని దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్ చేసిన అప్పులకు నెలకు రూ.7 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. తెలంగాణను దోచుకున్న దొంగలు బిఆర్ఎస్ నాయకులని, ఉద్యమం చేస్తున్నట్లు నటించి పార్టీ నిర్మించుకున్నారని అన్నారు. కెసిఆర్ గుణం ఇంకా మారలేదని  విమర్శించారు. కెటిఆర్ కాలు విరిగినా ఆయనే ప్రెస్ మీట్ పెట్టాలా? అని అద్దంకి ప్రశ్నించారు. కెటిఆర్ ను పైకి తేవడానికి పద్ధతి ప్రకారం కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారని, బిఆర్ఎస్ రజతోత్సవ సభలో హరీష్ రావు ఫొటో కూడా లేదని ఎద్దేవా చేశారు. హరీష్ రావును కరివేపాకులా పక్కన పెట్టారని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్