Friday, March 20, 2026

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్*

- Advertisement -

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్*

Special glimpses from 'Kannappa' on Mohanlal's birthday*

మలయాళంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ కూడా వరుసగా 200 కోట్ల వసూళ్లతో అదరగొడుతున్నాయి. ఆయన త్వరలోనే డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్, పాన్-ఇండియన్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’తో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. మోహన్ లాల్ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా కన్నప్ప నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి అందరినీ ఆకట్టుకునే అప్డేట్‌ను వదిలారు.
కన్నప్ప మేకర్లు మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా ఒక అద్భుతమైన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, కనిపించిన తీరు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మోహన్ లాల్ ఈ చిత్రంతో మళ్లీ ఆడియెన్స్‌పై తన ముద్రను వేసేలా కనిపిస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించేలా ఈ గ్లింప్స్‌ను కట్ చేశారు. మోహన్‌లాల్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
దైవిక శక్తితో ముడిపడి ఉన్న కిరాత అనే పాత్రను మోహన్‌లాల్ పోషించారు. కిరాత పాత్రలో మోహన్‌లాల్ ప్రెజెన్స్, యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం విష్ణు మంచు, కన్నప్ప టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూఎస్ టూర్‌ను పూర్తి చేశారు. కన్నప్ప నుంచి వస్తున్న ప్రతి అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ పోస్టర్‌లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్