కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్
చేసేదే చెప్తాం.. లేనిపోనిది చెప్పం మంత్రి..
Minister Komatireddy's counter to KTR
నల్గోండ
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొననీ కేటీఆర్ కు రాజకీయం అంటే తెలవదు. తండ్రి చాటున కొడుకుగా వచ్చి కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతుండు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది. పేదోడి ఇంట్లో సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఐదు లక్షలతో పేదోడికి ఇల్లు కట్టిస్తున్నామని అన్నారు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిండు. పదేళ్ల నాటి నుండి ఎక్కడ పేదోడికి ఇల్లు కట్టలే. కట్టినా ఏ ఒక్కరికి ఇవ్వలే. తక్కువ సమయంలోనే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్నాం.. మీరు 10 ఏళ్ల నుండి ఏం చేశారు. విద్యుత్ రంగంలో కూడా అప్పు చేసిన మీరు.. మేము గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ ద్వారా మోటార్లకు ఎలక్ట్రిసిటీ విద్యుత్ అందజేస్తున్నాం. అభివృద్ధిలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 6000 కోట్లు ఆర్టీసీకి కట్టాం. ఇచ్చిన మాట ప్రకారం పేదోడికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టి పనికిరాని కాలేశ్వరం కట్టారు.. మూడు సంవత్సరాలు కట్టారు.. కట్టిన సంవత్సరానికి కూలిపోయింది. పదేళ్లు పట్టించుకోని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదంతోనే ఎస్ఎల్బీసీ లో ప్రమాదం జరిగింది. ఎస్ ఎల్ బి సి ప్రమాదంలో మంత్రులు ముఖ్యమంత్రి 65 రోజులుగా సహాయక చర్యలు చేపట్టాం. అనుకూల వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడంతో జరిగిన ప్రమాదంపై కూడా రాజకీయం చేయడం సరికాదు. మీ చెల్లి మీ నాన్న మీ బావ మీరందరూ కలిసి ముందుగా మీ పార్టీని చూసుకోండి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎలా పాటుపడ్డారో ప్రస్తుతం మేము అలాగే ముందుకు వెళ్తున్నాం. గ్రామీణ నిరుద్యోగ యువకులకు రాజు యువ వికాసం కింద ఆదుకుంటున్నాం. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2న ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 119 ఇంటిగ్రేటెడ్ స్కూలు కట్టబోతున్నామని అన్నారు.



