Sunday, March 15, 2026

పాపం .జీవనరెడ్డికి కష్టాలు

- Advertisement -

పాపం .జీవనరెడ్డికి కష్టాలు
కరీంనగర్, మే 24, (వాయిస్ టుడే )

Sadly, Jeevan Reddy is having difficulties.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డికి కష్టాలు ఇప్పట్లో తొలిగేటట్లు కనిపించడం లేదు. జీవన్ రెడ్డికి పదవులు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. అలాగని ఆయన పార్టీలో కామ్ గా కూర్చుని ఉండే అవకాశాలు కూడా అంతే కనిపించడం లేదు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీకే ఇది పరిమితమయిందనుకుంటే పొరపాటు. అసలు సీనియర్ నేతలకు కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయా? అన్న అనుమానం జీవన్ రెడ్డిని చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సుదీర్ఘకాలంగా, పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ జెండాను వదలకుండా పోరాడిన ఈ నేతను ఇలా చులకన చేసిచూడటమేంటన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి… సీనియర్ నేత జీవన్ రెడ్డి గతంలో తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురి కావడంతో మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన ఎంత ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారో అర్థమవుతంుది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, అయినా పార్టీ కోసం భరిస్తూ వస్తున్నానని జీవన్ రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. కొన్ని దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతున్నారు. దాదాపు నలభై ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. తొలుత టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమయినా తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కొనసాగుతున్నారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజీవ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న నాటి నుంచి జీవన్ రెడ్డి లో అసహనం పెరిగింది. పార్టీ తనకు అన్యాయం చేస్తుందన్న భావనకు వచ్చినట్లే కనపడుతుంది. నాడే రాజీనామాకు సిద్ధపడిన జీవన్ రెడ్డి హైకమాండ్ పెద్దలు సముదాయించారు. ఢిల్లీపెద్దలు ఫోన్ చేసి మరీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ నచ్చచెప్పారు. తనకు కేబినెట్ లో స్థానం లభిస్తుందని భావించినా పార్టీ హైకమాండ్ కానీ, ఇక్కడ నేతలు కానీ పట్టించుకోక పోవడం జీవన్ రెడ్డిని మనస్తాపానికి గురి చేసినట్లయింది. పార్టీలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. అదే సమయంలో జగిత్యాలలోనే ఉంటూ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయినట్లే కనపడుతుంది.. బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి వెళతారని గతంలో ప్రచారం జరిగినప్పటికీ అందులో నిజం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ లోనే ఉంటూ తేల్చుకోవడానికి జీవన్ రెడ్డి సిద్ధమయ్యారని కనిపిస్తుంది. ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి జీవన్ రెడ్డి కొన్ని వినతి పత్రాలు ఇచ్చారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. వాటిని తీసుకున్న పొంగులేటి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించగా జీవన్ రెడ్డి సున్నితంగా తప్పుకున్నారు. “ఇది మీ ప్రభుత్వం అని, మీరు పాలించుకోండి” అంటూ జీవన్ రెడ్డి అక్కడి నుంచి కామ్ గా వెళ్లిపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్