Monday, February 23, 2026

 కాంగ్రెస్ లో కొత్త వర్సెస్ పాత

- Advertisement -

 కాంగ్రెస్ లో కొత్త వర్సెస్ పాత
హైదరాబాద్, జూన్ 7, (వాయిస్ టుడే)

New vs. old in Congress

అక్కడ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు.. ఇక్కడ క్యాడర్‌లో కన్ఫ్యూజన్‌. కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. వీటికి పరిష్కారం వెతకండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరేలా కార్యాచరణ రూపొందించాలన్నారామె. గత పదిరోజులుగా తెలంగాణలో మకాం వేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవ హారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్. పార్టీ నేతలతో మీనాక్షి వరుస సమీక్షలు నిర్వహించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలకు కొంతమంది అబ్జర్వర్స్‌ను నియమించి.. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మంతనాలు జరిపారు. వారి సమస్యలను, సూచనలను నోట్‌ చేసుకున్నారు జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మీనాక్షి ఆయనతో కీలక విషయాలను చర్చించారు. పదిరోజుల పాటు నేతలతో మాట్లాడిన విషయాలను వివరించారు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల పాత నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఆధిపత్యపోరుతో పార్టీ క్యాడర్ ఇబ్బందులు పడుతున్నారని రేవంత్‌కు చెప్పారు మీనాక్షి. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌ బలహీనంగా ఉందన్నారు నటరాజన్. ప్రభుత్వ పథకాలను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారన్నారామె. ఈ సమస్యలన్నింటికి పరిష్కార మార్గాలు చూపాలని రేవంత్‌కు తెలిపారు మీనాక్షి.మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయమన్నారు సీఎం రేవంత్.
మీనాక్షి నటరాజన్ సమీక్షల్లో చాలా మంది నేతలు జిల్లాలు, నియోజకవర్గాల్లో ఒక నేతపై మరొక నేత ఫిర్యాదులు చేసుకున్నారు. దాంతో పాటు ఆధిపత్యపోరుకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాలు, నియోజకవర్గాల్లో నేతలు సోషల్ మీడియాలో చాలా వీక్‌గా ఉన్నారని, చాలా మందికి సోషల్ మీడియాపై అవగాహన లేదని, ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి వివరాలు తెలియవని, వాటిపై వారికి అవగాహన లేకపోవవడంతో జనాలకు వివరించలేకపోతున్నారని మీనాక్షికి ఫిర్యాదులు అందాయి. అన్ని విషయాలను ఆమె సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ సమస్యలన్నింటికి పరిష్కార మార్గాలు చూపవలసిందిగా ఆమె సీఎంను కోరారు. అలాగే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల పాత నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని దీనికి చెక్ పెట్టాలని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. వీటన్నింటికి సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా కేబినేట్‌లో సమీక్ష చేయాలని నిర్ణయించారు. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నారు. కాగా ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు కేబినేట్ భేటీలు జరిగాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్