Monday, February 23, 2026

రాజకీయాలకు అతీతంగా బోనాలు సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం

- Advertisement -

రాజకీయాలకు అతీతంగా బోనాలు
సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం
సికింద్రాబాద్

Minister Ponnam at Bonalu review meeting, beyond politics

శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు – 2025 పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో  స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ,జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత,స్థానిక కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ ,మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,కోట నీలిమ వివిధ విభాగాల అధికారులు,ముఖ్య నేతలు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చరిత్రాత్మకమైన మహిమ గల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకుందామని అన్నారు.
ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన స్థానికులు సహకారం లేకపోతే విజయవంతం కాదు. గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకుని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ సమీక్ష. దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అందరికీ అభినందనలు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయ ఈవో నీ కోరుతున్న ఆలయం లోపల కేబుల్ వైర్ లు కొత్తవి వేసి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు.
బాకికేడింగ్  జాలి ఏర్పాటు చేయాలి. ఆతిధ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎవరికి తీసి పోరు. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు స్థానిక హైదరాబాద్ ప్రజలు వారి ఆతిధ్యం ఇవ్వాలి. ఏ ఏ పండగలు ఆయా ఏరియాలలో వాటర్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి..అవసరమైతే రెండు సార్లు ఇవ్వండి. హైదరాబాద్ మొత్తం ఒకే సారి అయితే కొంత ఇబ్బంది ఉంటుంది.. కానీ ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉంటుంది..భద్రత విషయంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి..ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి. 3600 దేవాలయాలకు సంబంధించి సమీక్ష రాష్ట్ర స్థాయి అధికారులతో జరిగింది. గోల్కొండ ,ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట , లాల్ దర్వాజా ఇలా ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. జోగిని వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. మాకు బోనం ఎత్తుకునే వారే ప్రథమ ప్రాధాన్యత..బోనాల సమయంలో కాకుండా రద్దీ తక్కువ ఉన్న సమయంలో వీఐపీ వస్తె ఇబ్బందులు ఉండవని అన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి. డెక్కన్ మానవ సేవ సమితి , ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాయి. అందరూ వారి సహకారం అందించి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్