Thursday, March 5, 2026

ఐ  ఆధారిత స్ట్రైకర్ మాకో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ను ప్రారంభించిన కేర్ ఆసుపత్రి

- Advertisement -

ఐ  ఆధారిత స్ట్రైకర్ మాకో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ను ప్రారంభించిన కేర్ ఆసుపత్రి
హైదరాబాద్

CARE Hospital launches eye-based Stryker Mako robotic surgery system

వైద్య రంగంలో మరో ముందడుగు కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ వారు అత్యాధునిక ఏఐ  ఆధారిత స్ట్రైకర్ మాకో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ను ప్రారంభించారు.. ఇది తెలంగాణలో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలకు ఒక కొత్త సూచకం… ఈ సాంకేతికతను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మరియు క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా లతో కలిసి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్, చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్,  ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ అశోక్ రాజు గొట్టెముక్కల, డాక్టర్ వాసుదేవ జువ్వాడి, డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ శరత్ బాబు ఇతర సీనియర్ డాక్టర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాకొ రోబో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స వల్ల రోగులు త్వరగా కోలుకుంటారన్నారు.. ఈ కార్యక్రమం ద్వారా కేర్ హాస్పిటల్స్ అధునాతన సాంకేతికతను తీసుకురావడంలో, రోగుల అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంలో తన నిబద్ధతను చూపుతోందన్నారు… రోగులకి మెరుగైన ఫలితాలు అందించడంలో, మరియు వైద్యరంగంలో ఉన్నత ప్రమాణాలను స్థాపించడంలో కేర్ హాస్పిటల్స్ చేస్తున్న కృషిని అభినందించారు… ఇది ముఖ్యంగా మొత్తం మోకాలి, పాక్షిక మోకాలి, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల రోగులు త్వరగా కోలుకోవచ్చు, నొప్పి తక్కువగా ఉంటుంది, అలాగే మంచి దీర్ఘకాలిక ఫలితాలు అందుతాయన్నారు… ఆరోగ్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ కీలకంగా మారుతున్నాయని, ఏఐ, రోబోటిక్స్ ఇక భవిష్యత్ సాంకేతికత కాదు ఇవే ఇప్పుడు జరుగుతున్న యథార్థం. ఇవి ఖచ్చితమైన వైద్యం, శస్త్రచికిత్సా విధానాలను ఆచ్యర్య పరిచే దిశగా వేగంగా మార్పులు తీసుకొస్తున్నాయని తెలిపారు… భవిష్యత్తులోనూ రోబోటిక్స్, ఏఐ సహాయంతో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రులు, వైద్యులకు సహకరించడం మా లక్ష్యం అని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్