ఖమ్మం జిల్లాలో నెలకొన్న వరద స్థితిగతులపై కలెక్టర్ దురిశెట్టితో ఎంపీ వద్దిరాజు సమీక్ష

- Advertisement -

ఖమ్మం జిల్లాలో నెలకొన్న వరద స్థితిగతులపై కలెక్టర్ దురిశెట్టితో ఎంపీ వద్దిరాజు సమీక్ష

MP Vaddiraju reviews flood situation in Khammam district with Collector Durisetty

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం జిల్లాలో నెలకొన్న వరద స్థితిగతులపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో సమీక్షించారు.
విస్తారంగా పడుతున్న వానలతో జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితులపై ఎంపీ రవిచంద్ర గురువారం కలెక్టర్ అనుదీప్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పర్యటనలో ఉన్న ఎంపీ రవిచంద్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుల ఆదేశానుసారం కలెక్టర్ అనుదీప్ తో ఫోన్లో మాట్లాడి వానలు, వరద స్థితిగతులపై సమీక్ష చేశారు.వానల వల్ల ప్రస్తుతం జిల్లాలో సాధారణ పరిస్థితులే ఉన్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని,ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించడం జరిగిందని ఎంపీ రవిచంద్రకు కలెక్టర్ వివరించారు.వర్షాలతో ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కూడా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ఎంపీ రవిచంద్రకు కలెక్టర్ అనుదీప్ తెలిపారు.వానలు,వరదలతో ఎలాంటి ఆస్థి,ప్రాణనష్టం వాటిల్లకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా,ప్రజలకు సాయమందించేందుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎంపీ వద్దిరాజు కలెక్టర్ దురిశెట్టికి హామీనిచ్చారు.వరద నివారణకు చేపట్టవలసిన ముందు జాగ్రత్తలు,చర్యల గురించి ఎంపీ రవిచంద్ర కలెక్టర్ అనుదీప్ కు పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular