సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వీధి కుక్కల దాడితో 25 మందికి గాయాలు

- Advertisement -

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వీధి కుక్కల దాడితో 25 మందికి గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా (సెప్టెంబర్ 19) వాయిస్ టుడే

25 people injured in stray dog ​​attack in Sircilla district center

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, నెహ్రు నగర్, మార్కండేయ నగర్, గణేష్ నగర్, సంజీవయ్య నగర్, శాంతినగర్ పరిసర ప్రాంతాలలో 25 మందికి పైగా వ్యక్తులపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులను ఇబ్బందిలకు గురిచేస్తున్నాయి. పురపాలక సంఘం అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. యాంటీ రేబిస్ ఇంజక్షన్ ఇవ్వకపోవడంతో కుక్కలు దాడికి దిగుతున్నాయని వాపోతున్నారు. వీధి కుక్కలను కొట్టి చంపడంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలను సురక్ష ప్రాంతాలకు తరలించి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయాలని, మున్సిపల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు ఇకనైనా మేల్కొని తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular