Saturday, February 21, 2026

జీ ఓ 5 ను వెంటనే రద్దు చెయ్యాలి :త్వరలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఆమరణ దీక్ష చేస్తా.. అధ్యక్షులు చందు జనార్దన్

- Advertisement -

జీ ఓ 5 ను వెంటనే రద్దు చెయ్యాలి –రాష్ట్ర కాపు జేఏసీ

బీసీ రిజర్వేషన్ బలిజ కాపు వర్గాలకు అమలు పరచాలి

దశల వారి ఉద్యమం -రిలే దీక్షలు.

మండలస్థాయి నుండి ఆందోళనలు –

త్వరలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఆమరణ దీక్ష చేస్తా.. అధ్యక్షులు చందు జనార్దన్ అనంతపురం

G.O.5 should be abolished immediately: I will soon start a fast unto death in favor of the state Kapu JAC.. President Chandu Janardhan

-సెప్టెంబర్ 23 (మంగళవారం ) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీ ఓ 5 ను వెంటనే రద్దు చేయాలనీ గిరి బలిజ లో బలిజ ను తొలగించాలని రాష్ట్ర కాపు జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ రాయలసీమ పర్యటన లో భాగంగా అనంతపురంలో బలిజ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్బంగా చందు జనార్దన్ మాట్లాడుతూ దొమ్మరులను కూటమి ప్రభుత్వం గౌరవించదాన్ని బలిజ వర్గాలు స్వాగతిస్తాయి కానీ గిరి బలిజ పేరిట జీ ఓ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తామని అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల వారి వంశం గా ఉన్న బలిజల్లో ఇతర కులాన్ని కలపడం బలిజలపై కూటమి ప్రభుత్వ దాడి గా బలిజలు భావిస్తారని విమర్శంచారు. తక్షణం జీ ఓ ను రద్దు చేసి గిరి బలిజ లో బలిజను తొలగించాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ కోరారు. దశాబ్దాల కాలం నుండి బలిజ,కాపు వర్గాలు ఎదురుచూస్తున్న బీసీ రిజర్వేషన్ అంశాన్ని పూర్తి చేసి, న్యాయం చేయాలని, బలిజ,కాపు వర్గాల సమస్యల కోసం బీసీ రిజర్వేషన్ కోసం త్వరలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చందు జనార్ధన్ స్పష్టత నిచ్చారు. గత ఎన్నికల్లో రాయలసీమ లో బలిజలకు కూటమి నాయత్వం అన్యాయం చేసిందని ప్రభుత్వం ఏర్పడ్డాక నేటికీ రాజకీయ భాద్యతల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ అవకాశం ఇవ్వలేదని ఇవ్వాల్సిందే నని చందు జనార్దన్ డిమాండ్ చేసారు. జనాభా దమాషా ప్రకారం 25 శాతం ఉన్న బలిజ లకు దామాషా ప్రకారం అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాన్యత గల స్థానాలు పోస్టింగ్ లు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ జే. ఏ. సి అధ్యక్షులు సోమ రౌతు రామకృష్ణ మాట్లాడుతూ.. గత జగన్ ప్రభుత్వంలో ఈ. డబ్ల్యూ. ఎస్. రిజర్వేషన్ మరియు బీసీ రిజర్వేషన్ కాపు, బలజ విద్యార్ధులకు అందుబాటులో లేకపోవడం వలన కనీసం ఐదు వేల వార్డ్ సెక్రటీస్ ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. అదే నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ రిజర్వేషన్ అందుబాటులోకి రాకపోవడం వలన డీఎస్సీ పరీక్షల్లో 15 వందలమంది విద్యార్ధులు నష్టపోయారు. ఈ కార్యక్రమంలో అనంతపురం బలిజ నాయకులు మంజునాథ్, జి.దివాకర్ (జనసేన),కాశెట్టి సంజీవ రాయుడు (జనసేన), గుర్రం నాగభూషణం మాజీ కార్పొరేటర్,ఆర్.చంద్రశేఖర్ రాయల్, ఏ.మనోహర్,ఏం.పవన్ కుమార్, పావురాల చంద్రశేఖర్,ఆర్.ధనుంజయ, పాండు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్