జీఏంఏ కన్వీనర్ రజనీకాంత్ ను సన్మానించిన ఎంపీ వద్దిరాజు 

- Advertisement -

జీఏంఏ కన్వీనర్ రజనీకాంత్ లను సన్మానించిన ఎంపీ వద్దిరాజు 

వాయిస్ టుడే: సూర్యాపేట

MP Vaddiraju honours GMA Convener Rajinikanth

MP Vaddiraju honours GMA Convener Rajinikanth
MP Vaddiraju honours GMA Convener Rajinikanth


బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ (జీఏంఏ) కన్వీనర్ సంగాని రజనీకాంత్ లను మున్నూరుకాపు ప్రముఖులు ఘనంగా సన్మానించారు.జీఏంఏ ఆధ్వర్యాన అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపాన లీస్ బర్గ్ వద్ద ఆగస్ట్ 30,31వతేదీలలో మహాసభ (కన్వెన్షన్) ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.జీఏంఏ అధ్యక్షులు పెద్ది వెంకట్, కన్వీనర్ రజనీకాంత్, పోలీస్ అధికారి సాధుల సారంగపాణి తదితర ప్రముఖుల ఆహ్వానం మేరకు ఎంపీ రవిచంద్ర ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది.దసరా పండుగ సందర్భంగా రజనీకాంత్ అమెరికా నుంచి తన స్వగ్రామం సూర్యాపేట మండలం బాలెంలకు వచ్చారు. రజనీకాంత్ ఆహ్వానం మేరకు ఎంపీ రవిచంద్ర బాలెంలకు విచ్చేసిన సందర్భంగా వారిద్దరిని మున్నూరుకాపు ప్రముఖులు వెల్మినేటి రమేష్,గాలి శ్రీనివాస్,మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు,మాజీ సర్పంచ్ రమేష్ నాయుడు,ప్రవాస భారతీయుడు గుమ్మడవల్లి సతీష్,గాలి సాయి తదితరులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్వగ్రామం బాలెంలలో రజనీకాంత్ తన స్వర్గీయ అనంతరాములు పేరిట ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ వద్దిరాజు సందర్శించారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు, రజనీకాంత్ కోరడంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చేయూతనిస్తానని హామీనిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular