Sunday, February 22, 2026

కాంతర చాప్టర్ 1 రివ్యూ

- Advertisement -

కాంతర చాప్టర్ 1 రివ్యూ:-

కాంతారా మొదటి భాగం ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా వచ్చి సూపర్ హిట్టు అయింది –

Kantara Chapter 1 Review

అన్ని భాషల ప్రేక్షకులుని హీరో, దర్శకుడు , రచయిత – రిషబ్ శెట్టి ఇంకో కొత్త లోకం లోకి చాలా విజయవంతంగా తీసుకెళ్లాడు – చూసినవాళ్ళు ఒక వింత అనుభూతి కి లోనయ్యారు . ఎందుకంటే – కాంతారా మొదటి భాగం లో హీరో కి భారతీయ కమర్షియల్ సినిమాల్లో ఉండే ఎలివేషన్స్ లేవు – ఉన్నదంతా “తొలకరి జల్లులు పడ్డప్పుడు ఎండిన నేల నుంచి వచ్చే “మట్టి వాసన”. కాంతారా రెండో భాగం లో రిషబ్ శెట్టి ఇంకో కొత్త లోకంలోకి తీసుకెళ్తాడు. రిషబ్ శెట్టి భూతకోలా సీక్వెన్సులను రెండో భాగం లో మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేయగలిగాడు. యాక్షన్ సీక్వెన్స్ లో అతడి కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అతడి ఆహార్యం, వ్యవహారశైలి చాలా సహజంగా ఉన్నాయి.

రిషబ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు- ఇంటర్వెల్ బ్యాంగ్ లో , క్లైమాక్స్ సీక్వెన్స్ లో , కచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది అతడి అభినయం. ఇక కథ లోకి వెళితే – కాంతార మొదటి భాగం – ఎక్కడ ఆగిందో సరిగ్గా అక్కడే ఈ కథ మొదలైంది. పంజుర్లి జాతర తర్వాత అడవిలో మాయమైపోయిన తన తండ్రి గురించి తెలుసుకోవడానికి శివ (చిన్నప్పటి రిషిబ్ శెట్టి) తాపత్రయపడుతుంటాడు. ఆ మాయం అయ్యే విషయం వెనుక దశాబ్దాల చరిత్ర ఉంటుంది. కాంతార ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే పేరు కల రాజు యొక్క రాజ్యం ఉంటుంది. రాజశేఖర్ వంశం ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ల ఆధీనంలోనే ఉంటుంది. అదే ప్రాంతంలో బెర్మే (రిషబ్ శెట్టి) ఉంటాడు. తన ప్రజల కోసం బర్మ ఏకంగా రాజ్యంలోకే వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బెర్మే, కనకావతి (రుక్మిణి వసంత్)కి దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ?, బెర్మే తన కాంతార కోసం ఏం చేశాడు ?, అసలు బెర్మే ఎవరు ?, అతను ఎక్కడ నుంచి వచ్చాడు ?, ఈ మధ్యలో కనకావతి పాత్ర ఏమిటి ?, ఆమె టార్గెట్ ఏమిటి ? అనేది మిగిలిన కథ. హీరోయిన్- రుక్మిణి వసంత్ ను ఇప్పటివరకు అయితే ఏడుస్తూ లేదా నవ్వుతూ చూసాం కానీ.. ఆమెను ఆకర్షణీయంగా, సొగసరిగా చూపించిన చిత్రమిదే అనే చెప్పాలి.

వయ్యారం కూడా హుందాగా పలికించింది ఆమె. ఆమెలోని మరో యాంగిల్ ను కూడా చూపించాడు రిషబ్, అది ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. ఆ సీక్వెన్సులో ఆమె నటన ఆశ్చర్యపరచడం ఖాయం. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఈ ఫ్రీక్వెల్ లో కూడా పలు సన్నివేశాలకు జీవం పోశాడు. చాలా సీన్లను బాగా ఎలివేట్ ఇక సినిమాటోగ్రఫి అదిరిపోయింది. దట్టమైన ఫారెస్ట్‌లో, మిస్టీరియస్ లొకేషన్లలో ఫోటోగ్రఫీ సూపర్ గా ఉంది. ఎడిటింగ్ లో ఈ సినిమా ని ఒక 15 నుంచి 20 నిమిషాలు కట్ చేసి ఉండొచ్చు – ముఖ్యం గా మొదటి భాగం స్లో గా సాగుతుంది – కొన్ని సీన్లు ఎందుకు ఉన్నాయి అర్థం కాదు. చివరిగా- కాంతారా మొదటి పార్ట్ లో ఉన్న మట్టి గుబాళింపులు కాంతారా రెండో భాగం లో మిస్ అయినాయి.

హీరో రిషబ్ శెట్టి ఎంట్రీ లేట్ అయినా కూడా – వచ్చినప్పట్నుంచి హీరో ని గ్లోరిఫై చేయడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి- కాంతారా కథలో ఉన్న అసలైన ఆత్మ కి కొంచెం దూరం గా జరిగారు – దాంతో మట్టి సువాసనలకు బదులు గా – సెంటు వాసనలు రావడం , అవి ఎక్కువైతే వచ్చే వికారాల్ని కూడా చూడొచ్చు . కంగువ, మగధీర, బాహుబలి , ఇలా కొన్ని సినిమాల కలగలుపు సీన్లు దీంట్లో చూడొచ్చు . ఏదైనా- పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా- గ్రాండ్ విజువల్స్, రిషబ్ శెట్టి అద్భుత నటన తో కూడిన కోలా నృత్య ప్రక్రియ అంతర్లీనం గా సాగే భక్తి తత్వం, దైవానికి రాక్షసుడికి (అధర్మానికి ) జరిగే ఘర్షణ లో ధర్మం మాత్రమే గెలవడం, అద్భుతమైన మ్యూజిక్, కొన్ని అద్భుతమైన సీన్లు చూడాలంటే మాత్రం వెళ్ళ వలసిన సినిమా – కాంతారా పార్ట్ 1. దీనికి కోన సాగింపు గా కాంతార పార్ట్ 2 కూడా ఉందని చివర్లో అనౌన్స్ చేశారు — అది వస్తుందో రాదో చూడాలి.

– సత్య కేశరాజు

వాయిస్ టుడే  కరెస్పాండెంట్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్